ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష

మా గురించి

మా మిషన్

భారత రాజ్యాంగము ‘86 వ రాజ్యాంగ సవరణ’ ద్వారా ‘ఆర్టికల్ 21A’  ప్రకారము 6 నుండి 14 సంవత్సరముల వయసు గల బాలబాలికలకు “ఉచిత నిర్బంధ విద్య” ను ‘ప్రాధమిక హక్కు’ గా రాజ్యాంగములో పొందుపరచబడినది. ఆర్టికల్ 21A అమలు చేయుటలో భాగముగా రూపొందించబడిన “విద్యా హక్కు చట్టము – 2009” నందు విద్యాభివృద్ధికి పొందుపరిచిన అంశములు అమలు చేయుటకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) కు చెందిన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ అయిన సర్వ శిక్షా అభియాన్ (SSA) ను కేంద్ర ప్రభుత్వము నోడల్ ఏజన్సీగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి (United Nations) ప్రతిష్టాత్మకముగా చేపట్టిన సహస్రాబ్ది లక్ష్యము (2000 – 2015) లలో ఒకటైన “అందరికీ విద్య” (విశ్వజనీయమైన విద్య (Universalisation of Education)) ను అమలు చేయవలసిన అంశములకు అనుగుణముగా విద్యా హక్కు చట్టము రూపొందించబడినది. సహస్రాబ్ది లక్ష్యములకు కొనసాగింపుగా ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశములలో “సుస్థిర అభివృద్ధి లక్ష్యములు – 17 (Sustainable Development Goals – 17 (SDGs)) (2016 – 2030)” ను ప్రవేశపెట్టినది. ప్రస్తుతము ఇవి అమలులో వున్నవి. సుస్థిర అభివృద్ధి లక్ష్యములులలో నాల్గవ లక్ష్యమైన “నాణ్యమైన విద్య” ను భారత దేశములో “సర్వ శిక్ష అభియాన్” ద్వారా అమలు చేస్తున్నారు.

సమగ్ర శిక్ష

భారత ప్రభుత్వము ఆర్ధిక సంవత్సరము 2018-19 లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యములో అమలు కాబడుచున్న వరుసగా సర్వ శిక్షా అభియాన్ (SSA), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA), ఉపాధ్యాయుల విద్యా (TE) అను మూడు ఫ్లాగ్ షిప్ పధకములను విలీనం చేసి “సమగ్ర శిక్షా (SAMAGRA SHIKSHA)” గా పేరు మార్పు చేసి ప్రస్తుతము పాఠశాల విద్య (1 నుండి 8 వ తరగతులు వరకు) ను పూర్వ ప్రాధమిక విద్య నుండి మాధ్యమిక విద్య (10+2) వరకు విస్తరించినారు.

దేశ వ్యాప్తముగా సర్వ శిక్షా అభియాన్ ద్వారా 6 నుండి 14 సంవత్సరముల వయసు గల బాలబాలికలకు “ఉచిత నిర్బంధ విద్య” ను అందచేయుటకు రూపొందించిన విద్యా హక్కు చట్టము అమలు చేయుటకు,  బాలబాలికలకు నూటికి నూరు శాతము విద్యను అందచేయుటకు, పాఠశాలల అభివృద్ధికి, పాఠశాలల మౌళిక సదుపాయములు కల్పన మరియు పాఠశాలల విద్యాభివృద్ధికి వినియోగిస్తున్న నిధులు విషయములో పారదర్శకత పెంపొందించుటకు, విద్యా ప్రమాణములను పెంపొందించుటకు, సాంకతిక పరిజ్ణానము సహాయముతో ప్రభుత్వ విధాన నిర్ణయములలో జాప్యము లేకుండా సత్వర నిర్ణయములు గైకొని తగు చర్యలు చేపట్టుటకు, విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించుటకు సమాచార మరియు సాంకేతిక పరిజ్ణానమును (Information and Communication Technology) వినియోగించుటకు దేశములో వున్న 29 రాష్ట్రములు మరియు 7 కేంద్ర పాలిత ప్రాంతముల పరిధిలో బ్లాక్ రిసోర్స్ సెంటర్ (ఆంధ్రప్రదేశ్ లో మండల వనరుల కేంద్రము అని పిలవబడుతుంది) లకు ఒక్కొక్క “మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ (MANAGEMENT INFORMATION SYSTEM CO-ORDINATOR)” అను కేటగిరీ ఉద్యోగమును భారత ప్రభుత్వ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆమోదముతో  సర్వ శిక్షా అభియాన్ ద్వారా  మంజూరు చేసినది. ఉమ్మడి రాష్ట్రములో 1137 మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ కో-ఆర్డినేటర్లకు 2012-13 ఆర్ధిక సంవత్సరమునకు ₹573.048/- లక్షల బడ్జెట్ కేటాయించబడినది.

సహస్రాబ్ది లక్ష్యములు

సహస్రాబ్ది లక్ష్యములు (Millennium Development Goals) 2015 వ సంవత్సరములో పూర్తి అవ్వడముతో ఇంకనూ చేరుకొనవలసిన లక్ష్యములకు కొనసాగింపుగా మరియు భవిష్యత్తులో విద్యాభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యములు కొరకు ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశములలో ప్రతిష్టాత్మకముగా ప్రవేశపెట్టిన “సుస్థిర అభివృద్ధి లక్ష్యములు 2030” లో నాల్గవ లక్ష్యమైన “నాణ్యమైన విద్య” అమలు చేయుటకు, విద్యాభివృద్ధికి నిర్ధేశించిన ఇంటెర్వేన్షన్స్ అమలు చేయుటలోనూ,  ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, ఈ-గవర్నెన్స్ అమలు చేయుటలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్స్ ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. 2018 వ సంవత్సరములో భారత ప్రభుత్వము మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యములో అమలు కాబడుచున్న వరుసగా సర్వ శిక్షా అభియాన్ (SSA), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA), ఉపాధ్యాయుల విద్యా (TE) అను మూడు ఫ్లాగ్ షిప్ పధకములను విలీనం చేసి “సమగ్ర శిక్షా (SAMAGRA SHIKSHA)” గా మార్పు జరిగిన తర్వాత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్స్ యొక్క విధులు మరియు భాధ్యతలు మరింత విస్తృతమైనవి. మండల స్థాయిలో విద్యాభివృద్ధికి యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

విద్యా హక్కు చట్టము 2009 నందు సెక్షన్ 27 ఈ క్రింది విధముగా పేర్కొంది

“పాఠశాలల ఉపాధ్యాయులు పార్లమెంట్, అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల ఎన్నికలు, విపత్తు నిర్వహణ కార్యక్రమములు మరియు జనాభా గణన ఈ మూడు సందర్బములలో తప్ప మిగతా సందర్బములలో భోధనేతర విధులు నిర్వహించడం నిషేదించబడినది.”

పైన పేర్కొన్న విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము సెక్షన్ 27 సెక్షన్ ప్రకారము మండల వనరుల కేంద్రము నందు 2012 సంవత్సరమునకు ముందు విధి నిర్వహణలో వున్న  సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్.జి.టి.) “మండల రిసోర్స్ పర్సన్” లను వారి వారి పాఠశాలలకు వెనక్కి పంపించి వారి స్థానములో “మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్” మండలమునకు ఒక్కొక్కరి చొప్పున రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు ప్రతిభ ఆధారముగా ఎంపిక చేసినారు.  

ప్రస్తుతము యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు జిల్లా స్థాయి అధికారులకు మరియు మండల స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సంధాన కర్తగా, సమన్వయ కర్తగా, కేంద్ర, రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయి ఉన్నతాధికారులు విద్యాభివృద్ధికి విధాన నిర్ణయములు తీసుకొను నిమిత్తము  సమాచారము క్రోడీకరించి కంప్యూటీకరణ చేయు విషయములో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు మండల మరియు గ్రామ స్థాయిలలో విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న ప్రతి పధకమును, అంశమును అమలు చేయుటకు మా యొక్క విధులును మరియు భాధ్యతలను అంకితభావముతో సమర్ధవంతముగా నిర్వహించుచున్నాము.