స్టాఫ్ & సమావేశాలు
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(MIS) పాత్ర బాధ్యతలురాజన్న బడి బాట
- ప్రతి విద్యా సంవత్సరము (Academic Year) ప్రారంభములో రాష్ట్ర వ్యాప్తముగా మండల పరిధిలో వున్న ప్రభుత్వ, అయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు మరియు అన్ని రకముల పాఠశాలలు నందు నూతనముగా ప్రవేశించే బాలబాలికల సమగ్ర సమాచారము మరియు వారి యొక్క వివరములు సేకరించుట.
- నూతన ప్రవేశము పొందిన విద్యార్ధుల వివరములు సేకరించి పాఠశాలల వారీగా రోజు వారి నమోదవుతున్న బాలబాలికలు వివరములు చైల్డ్ ఇన్ఫో ట్రాకింగ్ సిస్టమ్ నందు నమోదు చేయుట, పర్యవేక్షించుట. ఈ విషయములో ప్రతి ఒక్క యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లతో సమన్వయముతో వ్యవహరించి ప్రతి పాఠశాలలో విద్యార్ధులు నమోదు పారదర్శకముగా వుండే విధముగా తగు చర్యలు గైకొనుటలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
- మండల పరిధిలో వున్న అన్ని రకముల పాఠశాలల నందు నూతన ప్రవేశము పొందిన బాలబాలికల నమోదు వివరములు రోజువారీ నివేదికలను మండల స్థాయి మరియు జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు సమర్పించుట.
- నూతన ప్రవేశములకు సంబంధించి (New Admissions) బాలబాలికలకు సంబందించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు వివిధ రకముల నివేదికలు అంటే తరగతుల వారీగా, పాఠశాలల వారీగా, హాబీటేషన్స్ వారీగా, గ్రామముల వారీగా, ఆయా సామాజిక వర్గములు వారీగా షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఇతర కులములు వారీగా బాలబాలికల వివరములుతో కూడిన రిపోర్టులను రూపొందించుట, జనరేట్ చేయడం మరియు ఉన్నతాధికారులు కోరిన మీదట వాటిని వారికి సమర్పించడం యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ల ప్రధాన భాధ్యత.
జగనన్న అమ్మ ఒడి
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా చేపట్టిన నవరత్నములలో ఒకటైన జగనన్న అమ్మ ఒడి పధకము అమలు చేయుటలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- జగనన్న అమ్మ ఒడి పధకము యొక్క ప్రధాన ఉద్దేశ్యము ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 1 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు విద్యార్ధుల యొక్క అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలలో ప్రతి సంవత్సరము ₹15000/- లు నగదును జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమమును జనవరి 9, 2020 వ తేదీన చిత్తూరు నగరంలో గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ వారు ప్రతిష్టాత్మకముగా ప్రారంభించినారు.
- మండల పరిధిలో వున్న గ్రామము మరియు పాఠశాలల వారీగా లబ్దిదారుల వివరములు చైల్డ్ ఇన్ఫో ట్రాకింగ్ సిస్టమ్ ను ఆధారముగా చేసుకొని జగన్నన్న అమ్మ వొడి వెబ్సైట్ ద్వారా అర్హులను గుర్తుంచుట, సదరు వెబ్ సైట్ నందు విద్యార్ధులు, వారి తల్లుల ఆధార్ వివరములు, బ్యాంకు ఖాతా వివరములు నమోదు చేయుట, తగు ఆధారములు తనిఖీ చేసి బ్యాంకు ఖాతా వివరములు సరి చూచుట, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశముల మేరకు గ్రామ సచివాలయపు ఉద్యోగులైన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ లకు సమావేశములు ఏర్పాటు చేసి జగనన్న అమ్మ వొడి పధకమునకు సంబంధించి పూర్తి సమాచారము, వివరములు తెలియజేయుట. వారితో సమన్వయముతో వ్యవహరించి మండల పరిధిలో వున్న అర్హత గల లబ్దిదారులందరికి జగనన్న అమ్మవొడి ద్వారా ₹15000/- లు నగదు జమ అయ్యేలా అధికారులకు నివేదికలు సమర్పించుట.
- అర్హులైన లబ్దిదారులకు న్యాయము జరిగేలా చూచుటలో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
మన బడి - నాడు నేడు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా చేపడుచున్న ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయములు కల్పించుటకు ప్రవేశపెట్టిన “మన బడి నాడు నేడు” కార్యక్రమమునకు సంబంధించి స్కూల్ ట్రాన్స్మిషన్ మోనిటరింగ్ సిస్టమ్ (ఎస్.టి.యం.ఎస్.) వెబ్సైట్ మరియు మొబైల్ ఆప్ నందు పాఠశాలల ప్రస్తుత సమాచారమును సేకరించి క్రోడీకరించడము, పాఠశాలల వివరములు, ఫోటోలు ఎస్.టి.యం.ఎస్. మొబైల్ అప్ నందు అప్ లోడ్ చేయడములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ ప్రధాన భూమిక నిర్వహించుచున్నారు.
- రాష్ట్ర వ్యాప్తముగా ఆయా మండల పరిధిలో మన బడి నాడు నేడు కార్యక్రమమునకు ఎంపిక కాబడిన పాఠశాలల మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్స్ అప్ లోడ్ చేయడం, వెండార్ రిజిస్ట్రేషన్, ఇన్ వాయిస్ జనరేట్ చేయడం, రీజనల్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, డివిజనల్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు కోరిన మీదట మండల స్థాయిలో మన బడి నాడు నేడు కార్యక్రమము అమలు జరుగుతున్న పాఠశాలల ప్రస్తుత పనుల వివరములు సంగ్రహించి సమాచారము సేకరించి వాటిని కన్సోలిడేషన్ చేసి రోజు వారి నివేదికలు (Daily Status Reports) రూపొందించి సమర్పించడంలో రాష్ట్ర వ్యాప్తముగా యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు.
- మన బడి నాడు నేడు అమలు కార్యక్రమములో భాగముగా మండల స్థాయిలో ఎంపిక కాబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్లష్టర్ రిసోర్స్ పర్సన్స్, అసిస్టెంట్ ఇంజీనీర్, గ్రామ సచివాలయపు ఉద్యోగులైన ఇంజినీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు డిజిటల్ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగులతో సమన్వయముతో వ్యవహరించి సమాచారము సేకరించి క్రోడీకరించడములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నారు.
- జిల్లా స్థాయి అధికారులు రూపొందించే స్ప్రెడ్ షీట్స్ నందు ప్రస్తుత డేటా సేకరించి నమోదు చేయడములోనూ, మండల స్థాయిలో ఆయా పాఠశాలల మన బడి నాడు నేడు పనులు యొక్క పురోగతిపై నివేదికలు రూపొందించుటలోనూ యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
- శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారి ఆదేశముల మేరకు మన బడి నాడు నేడు పనులనూ స్వయముగా పరిశీలన చేసి నివేదికలు రూపొందుచుటకు మండల పరిధిలో వున్న పాఠశాలలను కూడా యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు సందర్శించవలసివస్తుంది.
మండల స్థాయిలో అన్ని రకముల స్టాటస్టికల్ డేటాతో పాటు ప్లానింగ్, U-DISE PLUS నిర్వహణ.
- మండల పరిధిలో వున్న అన్ని రకముల స్టాటిస్టికల్ డేటా సేకరించడం, ముఖ్యముగా మండల పరిధిలో వున్న హాబిటేషన్స్, గ్రామముల వివరములు, హాబీటేషన్ మరియు గ్రామాల వారీగా నివసించుచున్న జనాభా వివరములు, విద్యార్ధుల వివరములు ప్రతి హాబీటేషన్ మరియు గ్రామములా వారీగా పాఠశాలల వివరములు మరియు మౌళిక సదుపాయముల వివరములు, పాఠశాలల నందు చదువుచున్న విద్యార్ధుల వివరములు, ఆయా సామాజిక వర్గముల వివరములు, విద్యార్ధుల వయస్సుల వారీగా వివరములు, తరగతుల వారీగా వివరములు మరియు అన్ని రకరముల స్టాటిస్టికల్ డేటా వివరములు సేకరించి కంప్యూటర్ నందు నిక్షిప్తము చేయడములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
- U – DISE విశ్లేషణ, DCF పూర్తి చేయు విధానముపై పూర్తి వివరములతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం.
- ఆన్యువల్ వర్క్ ప్లాన్ మరియు బడ్జెట్ (Annual Work Plan & Budget) నిమిత్తము మండల మైక్రో ప్లానింగ్, మండల అభివృద్ధి ప్రణాళిక మరియు గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపొందించి శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారి ఆమోదముతో జిల్లా స్థాయి అధికారులకు సమర్పించడం.
- మండల అభివృద్ధి ప్రణాళిక మరియు గ్రామ అభివృద్ధి ప్రణాళిక రూపొందించే క్రమములో సుమారు 44 డేటా టేబుల్స్ ను పూర్తి చేసే క్రమములో మండల స్థాయిలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో- ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
గౌరవ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు ప్రభుత్వ పధకముల యొక్క వెబ్ పోర్టల్ డేటా నిర్వహణ.
- గౌరవ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు వెబ్ పోర్టల్ https://cse.ap.gov.in నందు గౌరవ కమీషనర్ వారు మరియు ఇతర ఉన్నత స్థాయి అధికారులు కోరిన డేటాను మండల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ తో సమన్వయముతో వ్యవహరించి, డేటా సేకరించి సంబంధిత నమూనాలలో డేటాను పొందుపరచడం.
- జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్దలు మరియు మన బడి నాడు నేడు మొదలగు పధకముల యొక్క డేటా నిక్షిప్తము చేయడం, ప్రస్తుత సమాచారమును నిక్షిప్తము చేయడము.
- మండల స్థాయిలో విద్యాభివృద్ధికి అమలు చేయు అన్ని రకముల పధకముల యొక్క గణాంకములను విశ్లేషించి సంబంధిత వెబ్ పోర్టల్ నందు నిక్షిప్తము చేయడములో యం.ఐ.ఎస్. కొ-ఆర్డినేటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
- విద్యా హక్కు చట్టములో పొందుపరిచిన అంశములు అమలు చేయుటకు ముఖ్యముగా యూనిఫార్మ్ పంపిణీ, జాతీయ టెక్స్ట్ బుక్స్ పంపిణీ మొదలగు వాటిలో పారదర్శకత పెంపొందించుటాకు వెబ్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ సిస్టమ్ డేటాను నిక్షిప్తం చేయడములో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు ప్రధాన భూమిక నిర్వర్తించుచున్నారు.
- పైన పేర్కొన్న వెబ్ పోర్టల్స్ తో పాటు అదనముగా జాతీయ స్థాయిలో మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారు రూపొందించే ఫిట్ ఇండియా, షాలా సిద్ది, U DISE PLUS మొదలగు వాటిని కూడా మండల స్థాయి డేటాను సేకరించి సంబంధిత వెబ్ పోర్టల్ నందు నిక్షిప్తము చేయుటలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు ప్రధాన భూమిక నిర్వహించుచున్నారు.
కంప్యూటర్ అయిడెడ్ లెర్నింగ్ స్కూల్స్ నందు కంప్యూటర్స్ మరియు డిజిటల్ క్లాస్ రూమ్స్ పని పరిస్థితులపై పర్యవేక్షణ
- మండల పరిధిలో ఎంపిక కాబడిన పాఠశాలల నందు కంప్యూటర్ అయిడెట్ లెర్నింగ్ స్కూల్స్ నందు కంప్యూటర్స్ యొక్క పని పరిస్థితులపై పర్యవేక్షణ చేయడం.
- Computer Aided Learning Schools విద్యార్ధులకు కంప్యూటర్ పని పరిస్థితులు పరిశీలించి సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ సమస్యలు వున్న యెడల వాటిని పరిష్కరించుటకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి అనుమతితో రిపైర్ చేయించి విద్యార్ధులకు అందుబాటులోనికి తీసుకుని రావడం.
- మండల స్థాయిలో ఎంపిక కాబడిన పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహణ, సాఫ్ట్ వేర్ అప్డేషన్, యూసెజ్ అవర్స్ పెంపుకు కృషి చేయడం మరియు పర్యవేక్షణ బాధ్యతలను యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లకు ఉన్నతాధికారులు అప్పగించియున్నారు.
- మండల స్థాయిలో ఎంపిక చేయబడిన పాఠశాలల నందు డిజిటల్ క్లాస్ రూమ్స్ నిర్వహించు విషయములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లను నోడల్ అధికారులుగా శ్రీయుత జిల్లా విద్యా శాఖాధికారులు నియమించియున్నారు.
శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారు అప్పగించే ఇతర విధులు మరియు బాధ్యతలు.
జగనన్న గోరుముద్దలు (మధ్యాహ్న భోజన పధకము (యం.డి.యం.)) ఆన్ లైన్ డేటా
జగనన్న గోరుముద్దలు అమలు చేయుటకు క్రోడీగుడ్లు, చిక్కిలు, అవసరమైన బియ్యం మొదలగు వాటి వివరములు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నుండి అవసరమైన సమాచారము సంగ్రహించి మండల్ విద్యా శాఖాధికారి వారి ఆమోదముతో జిల్లా స్థాయి అధికారులకు సమర్పించడం, వీటికి అవసరమైన నివేదికలు రూపొందించడం, మధ్యాహ్న భోజన పధకము బిల్లులు రూపొందించడం, యం.ఐ.ఎస్. (యం.డి.యం.) డేటా ఆన్ లైన్ చేయడం.
పాఠశాలలను మరియు ఇతర కార్యాలయములను సందర్శించడం
శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారి ఆదేశముల మేరకు మండల పరిధిలో వున్న పాఠశాలల సందర్శన, డివిజనల్ స్థాయి మరియు జిల్లా స్థాయి సమీక్ష సమావేశములకు హాజరు కావడం, ఉపాధ్యాయుల బిల్లుల సమస్యల పరిష్కరించుటకు సబ్ ట్రెజరీ కార్యాలయములకు, బ్యాంకులకు మరియు ఇతర కార్యాలయములకు సందర్శించడం మొదలగునవి.
రోజు వారి ఈ-మెయిల్స్ పరిశీలించుట
శ్రీయుత జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీయుత ప్రాజెక్ట్ అధికారి, సమగ్ర శిక్షా అభియాన్ వారి కార్యాలయముల నుండి వచ్చే రోజు వారి ఈ-మెయిల్స్ ను పరిశీలించి నిర్ధేశించిన గడువు తేది లోపు స్పందించి కోరిన సమాచారమును శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారి ఆమోదముతో సంబంధిత ఉన్నత స్థాయి అధికారుల కార్యాలయములకు మెయిల్ చేయడం.
జిల్లా స్థాయి మరియు మండల స్థాయి ఉన్నతాధికారుల మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించడం
జిల్లా స్థాయి అధికారులైన సమగ్ర శిక్షా అభియాన్ అన్ని విభాగములకు చెందిన సెక్టోరల్ అధికారులకు మరియు మండల విద్యా శాఖాధికారికి మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించడం.
ఉన్నత స్థాయి అధికారులు కోరిన సమాచారమును సేకరించే క్రమములో మండల పరిధిలో వున్న ఉపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ మరియు ఇతర ఉద్యోగులతో సమన్వయ పరిచుకొని వారందరి సహకారముతో పూర్తి స్థాయి సమాచారమును సంగ్రహించి క్రోడీకరించి కంప్యూటీకరణ చేయడం
ప్రతి మండలములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ శ్రీయుత మండల విద్యాశాఖాధికారి మరియు ప్రధానోపాధ్యాయులకు, శ్రీయుత మండల విద్యాశాఖాధికారి మరియు జిల్లా స్థాయి అధికారులకు మధ్య సంధాన కర్త మరియు సమన్వయ కర్తగా వ్యవహరిస్తూ విద్యాభివృద్ధికి ప్రభుత్వము చేపట్టే పధకము మరియు అంశముల అమలు విషయములో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
డివిజనల్ స్థాయి మరియు జిల్లా స్థాయి సమావేశములకు హాజరవ్వడం
శ్రీయుత ప్రాజెక్ట్ అధికారి, సమగ్ర శిక్షా అభియాన్, శ్రీయుత జిల్లా విద్యాశాఖాధికారులు మరియు శ్రీయుత మండల విద్యాశాఖాధికారుల ఆదేశముల మేరకు నెలకు సరాసరిన 4 నుండి 6 మార్లు సమీక్ష సమావేశములకు, శిక్షణ తరగతులకు, వర్క్ షాప్స్ మరియు ఇతర అంశములుపై కోరిన సమాచారము అందజేయుటకు యం.ఐ.ఎస్. కో- ఆర్డినేటర్లు జిల్లా ప్రధాన కేంద్రమునకు వెళ్లవలసి వస్తున్నది.
యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లకు టెలీ కాన్ఫెరెన్స్ జిల్లా స్థాయి అధికారులు నిర్వహించి విద్యాభివృద్ధికి సంబంధించి మండల స్థాయిలో చేయవలసిన అనేక కార్యక్రమములపై సూచనలు, సలహాలు ఇవ్వడముతో పాటు లక్ష్యములు పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకొంటున్నారు.
వాట్స్ ఆప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా లక్ష్యాలను నిర్ధేశిస్తూ, నిర్ధేశించిన గడువు తేది లోపు సమాచారమును సేకరించే విధముగా సంబంధిత సామాజిక మాధ్యమముల ద్వారానే పర్యవేక్షిస్తూనందున సమాచారమును వేగముగా సంగ్రహించి క్రోడీకరించి కోరిన సమాచారమును ఉన్నత స్థాయి అధికారులకు మేము సమర్పించడం జరుగుతుంది.
ఇతర విధులు మరియు భాధ్యతలు
స్పందన కార్యక్రమము ద్వారా వెబ్సైట్ నందు వచ్చు ఫిర్యాదుల పరిశీలన శ్రీయుత మండల విద్యా శాఖాధికారి వారి ఆదేశముల మేరకు వాటిని పరిష్కరించుటకు చర్యలు గైకొనుట, వాటి నిర్వహణ.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆయా జిల్లాల శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశముల మేరకు పరీక్ష కేంద్రములలో వెబ్ కేమెరాలను అమర్చుటకు కూడా యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్ల సేవలను విస్తృత స్థాయిలో వినియోగిస్తున్నారు.
కమీషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ నందు ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాఠశాలల విద్యార్ధుల యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ I, II,III,IV మరియు సమ్మేటివ్ అసెస్మెంట్ I,II,III పరీక్షల గ్రేడ్స్ డేటా ఎంట్రీ
విద్యా హక్కు చట్టము – 2009 అమలు
విద్యా హక్కు చట్టము 2009 అమలులో భాగముగా బడి బయట పిల్లల సమాచారమును సేకరించి క్రోడీకరించడం, చట్టములో పేర్కొన్న ప్రతి అంశము యొక్క డేటా సేకరించి ఉన్నతాధికారులకు సమర్పించడం, మండల పరిధిలో వున్న పాఠశాల విద్యార్డులకు ఉచిత ఏక రూప దుస్తులు మరియు టెక్ట్స్ బుక్స్ పంపిణీ చేయు విషయములో యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లు పారదర్శకతతో కూడిన సమాచారమును అధికారులకు సమర్పిస్తున్నారు.
సమాచార హక్కు చట్టము:
యం.ఐ.ఎస్. కొ-ఆర్డినేటర్లను అన్ని మండలములలో “అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి” గా నియమించియున్నారు. సమాచార హక్కు చట్టం యొక్క ధరఖాస్తులు యం.ఐ.ఎస్. కొ-ఆర్డినేటర్లు పరిశీలించవలసి వస్తుంది
ఈ – హాజర్ (E - HAZAR)
- ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల ఈ-హాజర్ అమలు చేయుట, పర్యవేక్షణ బాధ్యతలు మరియు టాబ్స్ నందు ఉత్పన్నమవుచున్న సాంకేతిక సమస్యలు పరిష్కరించుట, ఉపాధ్యాయుల లీవ్స్ కన్ఫర్మేషన్ అండ్ అప్రూవల్ (మండల విద్యాశాఖాధికారి అనుమతి మరియు ఆదేశముల మేరకు) చేయడం.
- మండల పరిధిలో వున్న అన్ని పాఠశాలలలో ‘ఈ-హాజర్’ ను పూర్తి స్థాయిలో అమలు చేయుటకు శ్రీయుత జిల్లా విద్యాశాఖాధికారులు యం.ఐ.ఎస్. కో-ఆర్డినేటర్లను నోడల్ అధికారులుగా నియమించియున్నారు.
మండల వనరుల కేంద్రము యొక్క పరిపాలనా పరమైన విధులు మరియు భాధ్యతలు నిర్వహణ (Administrative Roles)
- మండల వనరుల కేంద్రము (మండల విద్యాశాఖాధికారి కార్యాలయము) యొక్క పరిపాలన పరమైన విధులు మరియు బాధ్యతలను నిర్వహించడం.
- మండల స్థాయిలో జరుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల నిర్వహణ మరియు సమావేశమునకు అవసరమైన డేటా సేకరించి శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారికి సమర్పించడం.
మండల వనరుల కేంద్రము యొక్క పరిపాలనా పరమైన విధులు మరియు భాధ్యతలు నిర్వహణ (Administrative Roles)
- మండల వనరుల కేంద్రము (మండల విద్యాశాఖాధికారి కార్యాలయము) యొక్క పరిపాలన పరమైన విధులు మరియు బాధ్యతలను నిర్వహించడం.
- మండల స్థాయిలో జరుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల నిర్వహణ మరియు సమావేశమునకు అవసరమైన డేటా సేకరించి శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారికి సమర్పించడం.
కాంప్రాహేన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (Comprehensive Financial Management System) నిర్వహణ
- శ్రీయుత మండల విద్యాశాఖాధికారి ఆదేశముల మేరకు ఉపాధ్యాయుల జీతాల బిల్లులను అప్ లోడ్ చేయడం, పాఠశాలల పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ జనరేట్ చేయడం, మండల వనరుల కేంద్రము బిల్లులు అప్లోడ్ చేయడం మొదలగునవి మరియు సి.ఎఫ్.యం.ఎస్. (కాంప్రాహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) నిర్వహణ.
- పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్ జనరేట్ చేయడం.
- మండల పరిధిలో వున్న అన్నీ పాఠశాలల యొక్క నిధులు జమ అయ్యేలా తగు చర్యలు తీసుకోవడం
- అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సి.ఎఫ్.యం.ఎస్. నందు జనరేట్ చేయు బిల్లుల విషయములో సందేహములను నివృత్తి చేయడం.
మండల వనరుల కేంద్రము యొక్క పరిపాలనా పరమైన విధులు మరియు భాధ్యతలు నిర్వహణ (Administrative Roles)
- మండల వనరుల కేంద్రము (మండల విద్యాశాఖాధికారి కార్యాలయము) యొక్క పరిపాలన పరమైన విధులు మరియు బాధ్యతలను నిర్వహించడం.
- మండల స్థాయిలో జరుగు ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల నిర్వహణ మరియు సమావేశమునకు అవసరమైన డేటా సేకరించి శ్రీయుత మండల విద్యాశాఖాధికారి వారికి సమర్పించడం.