స్టాఫ్ & సమావేశాలు

నియామక ప్రక్రియ
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
Full Staff Directory

Our Specialties

నియామక ప్రక్రియ: సర్కులర్ నెం. 5730/RVM/(SSA)/B10/2010 Dated: 22-08-2012, Office of the Project Director, Rajiv Vidya Mission (SSA), Andhra Pradesh, Hyderabad ప్రకారము మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ నియామక విధానము మరియు ప్రక్రియపై మార్గదర్శకములును అప్పటి గౌరవనీయులు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి ఉషా రాణి గారు, ఐ.ఏ.ఎస్., వారు సదరు సర్కులర్ నందు పేర్కొన్న సూచిక తమ కార్యాలయపు లేఖ. Lr. Rc. No. 5730/RVM(SSA)/B10/2010, dated 07.08.2012 ద్వారా శ్రీయుత కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ లకు నియామక ప్రక్రియపై జారీ చేసిన మార్గదర్శకములు ఈ క్రింది విధముగా వున్నవి.

1. జారీ చేసిన మార్గదర్శకములలో 8 వ నిర్ధేశనము

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో ఆర్డినేటర్ నియామకము విషయములో స్వీకరించిన ధరఖాస్తులలో అర్హత గల వారి జాబితాను జిల్లాల వారీగా తయారుచేయాలి. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో ఆర్డినేటర్ తప్పనిసరిగా ఏ మండలములో అయితే నివాసముంటున్నారో అదే మండలమునకు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో ఆర్డినేటర్ గా ఎంపిక చేయవలెను. అందువలన, అర్హత గల అభ్యర్డులును మండలముల వారీగా అర్హుల జాబితా రూపొందించి 50% వెయిటేజ్ ఆధారముగా వ్రాత పరీక్ష ద్వారా మార్కులు లెక్కకట్టి మార్కులు పొందుపరిచి మెరిట్ జాబితా రూపొందించాలి. రిజర్వేషన్ అమలుకు జిల్లాను యూనిట్ గా పరిగణించాలి, అది ఏ విధముగా అంటే జిల్లాలో మొత్తము ఉద్యోగములలో 15% షెడ్యూల్డ్ కులములు (ఎస్.సి.,), 6% షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి.,), 25% వెనుక బడిన తరగతులు (బి.సి.,), 3% దివ్యాంగులు (పి.హెచ్.సి.,), మిగిలిన ఉద్యోగాలు జనరల్ అభ్యర్ధులతో భర్తీ చేయాలి. అయినప్పటికీ, 33% ఖాళీలు ప్రతి కేటగిరీలో మహిళ అభ్యర్ధులకు రిజర్వడ్ చేయాలి.

2. జారీ చేసిన మార్గదర్శకములలో 9 వ నిర్ధేశనము

ఉదాహరణకు, ఒక జిల్లాలో 50 మండలములు వున్నట్లయితే, సంబందిత జిల్లాలో రిజర్వేషన్ ను ఈ క్రింది విధముగా రూపొందించాలి.

a) జిల్లాలో వున్న మొత్తము ఖాళీలు                    :50

b) ఎస్.సి. అభ్యర్ధులతో భర్తీ చేయవలసినవి :           08

c) ఎస్.టి. అభ్యర్ధులతో భర్తీ చేయవలసినవి :           03

d) బి.సి. అభ్యర్ధులతో భర్తీ చేయవలసినవి :           13

e) పి.హెచ్. అభ్యర్ధులతో భర్తీ చేయవలసినవి :       02

f)  పి.హెచ్. అభ్యర్ధులతో భర్తీ చేయవలసినవి :       24

3. జారీ చేసిన మార్గదర్శకములలో 10 వ నిర్ధేశనము

వ్రాత పరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్ధులందరికీ రెవిన్యూ/తాలూకు/ బ్లాక్ స్థాయిలలో శ్రీయుత కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆమోదముచే ఏర్పాటు చేయబడిన నిపుణుల కమిటీ ద్వారా స్కిల్ టెస్ట్ నిర్వహించాలి.  నిపుణులు కమిటీలో సభ్యులు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్/జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అయి వుండాలి. వారు అభ్యర్ధులను సంప్రదించి వ్రాత పరీక్ష  నిర్వహించి మొత్తము మార్కులు అంటే ప్రతిభ ఆధారముగా (50%) మరియు నైపుణ్య పరీక్ష (Skill Test) (50%) రెండిటినీ కలిపి రిజర్వేషన్ నిబంధనలను అనుసరిస్తూ అభ్యర్ధులను ఎంపిక చేయాలి. ఈ ఉద్యోగములకు ఎటువంటి ఇంటర్వూలు నిర్వహించరాదు.

4. జారీ చేసిన మార్గదర్శకములలో 11 వ నిర్ధేశనము

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ లుగా ఎంపిక కాబడిన తర్వాత, మండల విద్యా శాఖాధికారి వారిని కాంట్రాక్టు పద్దతిలో విధులలోనికి తీసుకోవాలి.

పై ప్రక్రియ మొత్తమును అన్ని జిల్లాల కలెక్టర్లు 12, సెప్టెంబర్ 2012 లోపు అపాయిమెంట్ ప్రక్రియను పూర్తి చేసి, మండల రిసోర్స్ పర్సన్స్ (యం.ఆర్.పి.) ను వారి వారి పాఠశాలలకు ది. 31.08.2012 లోపు తిరిగి పంపించవలసినదిగా గౌరవనీయులు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, రాజీవ్ విద్యా మిషన్ (ఎస్.ఎస్.ఏ.) వారు ఆదేశించినారు. 

  1. a) జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఏర్పాటు: జిల్లా స్థాయి ఎంపిక కమిటీ శ్రీయుత కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ వారు ఛైర్మన్ గా ఏర్పాటు చేయాలి. జిల్లా ఎంపిక కమిటీ కూర్పు ఈ క్రింది విధముగా వుండాలి.

   

  1. i)       కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్                                    –           ఛైర్మన్
  2. ii)     జిల్లా విద్యా శాఖాధికారి                                            –           మెంబర్

iii)        ప్రిన్సిపాల్ డి.ఐ.ఈ.టి.,                                       –           మెంబర్

  1. iv)    ఒక సబ్జెక్ట్ ఎక్స్పెర్ట్                                    –           మెంబర్
  2. v)     ప్రాజెక్ట్ అధికారి, ఆర్.వి.యం. (ఎస్.ఎస్.ఏ)     –           మెంబర్ కన్వీనర్

 

పై విధముగా ఏర్పాటు కాబడిన జిల్లా ఎంపిక కమిటీ చూడవలసినవి:

(i)          వార్తా పత్రికలలో నోటిఫికేషన్ జారీ చేయుట.

(ii) రోస్టర్ పాయింట్స్ అండ్ మెరిట్ లిస్ట్ రూపొందించుట.

(iii)           అవసరమైనచో ఇంటర్వూ లు మొదలగునవి నిర్వహించుట.

(iv)           అభ్యర్డుల ఎంపిక ప్రక్రియ మొత్తమును పర్యవేక్షించుట.

  1. b) యూనిట్ ఆఫ్ అపాయిమెంట్:
  2. i)                   సంబంధిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ ను అపాయిమెంట్ చేయు విషయములో మండలమును యూనిట్ గా పరిగణించాలి.
  3. ii)                అభ్యర్ధి ఏ మండలమునకు అయితే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ గా ధరఖాస్తు చేస్తారో తప్పని సరిగా అదే మండలమునకు చెందిన వారై వుండాలి.

iii)              ఒక వేళ అర్హత గల అభ్యర్ధులు సంబంధిత యూనిట్ లో ప్రత్యేక రిజర్వర్డ్  కేటగిరీ అభ్యర్ధులు అందుబాటులో లేకపోయినట్లయితే, ఇతర రిజర్వర్డ్ కేటగిరీ అభ్యర్ధులను అదే యూనిట్ నందు ప్రమాణీకముగా తీసుకొనవచ్చును.

  1. iv)              సంబంధిత యూనిట్ నందు అర్హత గల అభ్యర్ధులు అందుబాటులో లేనట్లయితే, ఇతర యూనిట్ లకు చెందిన అర్హత గల అభ్యర్ధులను అదే రిజర్వర్డ్ కేటగిరికీ చెందిన వారిని పరిగణనలోనికి తీసుకోవాలి.

 

  1. c) రూల్ ఆఫ్ రిజర్వేషన్:

రూల్ ఆఫ్ రిజర్వేషన్ పైన పేర్కొన్న నిబంధనల ప్రకారము క్రమ పద్ధతిలో అన్ని ఉద్యోగాలకు అనుసరించాలి. జిల్లా ను యూనిట్ గా పరిగణించి రూల్ రిజర్వేషన్ రూపొందించవలసిన భాధ్యత ప్రాజెక్ట్ అధికారి వారిది.

 

  1. d) వయస్సు :

పద్ధెనిమిది సంవత్సరముల వయసు లోపు వున్న అభ్యర్ధులు ఈ ఉద్యోగమునకు అనర్హులు. ది. 01.07.2012 వ తేదీ నాటికి 39 సంవత్సరములు వయస్సు లోపు వున్న వారు ఈ ఉద్యోగమునకు అర్హులు. అయినప్పటికీ, ఒక వేళ ఎస్.సి./ఎస్.టి./బి.సి. అభ్యర్ధులు గరిష్ట వయస్సు పరిమితి 44 సంవత్సరములు మరియు దివ్యాంగులకు గరిష్ట వయస్సు పరిమితి 49 సంవత్సరములు.  

 

  1. e) నివాస ధృవ పత్రములు:

ఈ క్రింద పేర్కొన్న ఏదేని ధృవపత్రములలలో ఒకటి స్థానిక ప్రాంతము అని ధృవీకరించుటకు అభ్యర్ధి యొక్క ఎంపిక కొరకు ప్రామాణీకముగా తీసుకొనబడుతుంది.

  1.                   రేషన్ కార్డు
  2.                 ఆధార్ కార్డు

iii.               బ్యాంక్ పాస్ బుక్

  1.               డ్రైవింగ్ లైసెన్స్
  2.                 తహశీల్దార్ వారిచే జారి చేయబడిన సంబందిత నివాస ధృవీకరణ పత్రము

 

  1. f)  విద్యార్హతలు:

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్

(i)                బి.ఎస్.సి., (మాధ్స్/స్టాటిస్టిక్స్) తో పాటు పి.జి.డి.సి.ఏ.,

                                          లేదా

(ii)             బి.ఎస్.సి., (మాధ్స్/స్టాటిస్టిక్స్) తో పాటు కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా వుండాలి.

                                          లేదా

(iii)           బి.కామ్., (స్టాటిస్టిక్స్ తో పాటు కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ గా వుండాలి)

                                          లేదా

(iv)           బి.కామ్., (స్టాటిస్టిక్స్ మరియు పి.జి.డి.సి.ఏ.,)

 

  1. g) మెరిట్ లిస్ట్:

మండలముల వారీగా మెరిట్ జాబితాను రూపొందించి మండలమును యూనిట్ గా పరిగణించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ గా అపాయిమెంట్ చేయాలి.

 

  1. h) చెల్లించే గౌరవ వేతనము:

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ –    ₹8400/- లు ఒక నెలకు (ప్రారంభ వేతనము)

 

  1. i)   ఎంపిక విధానము: మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ ఎంపిక విధానము మొత్తము అభ్యర్ధులలో మెరిట్ జాబితా ఈ క్రింది విధముగా చేయవలెను. 

(i)                50 మార్కులు అకడమిక్/టెక్నికల్ విద్యార్హతలుకు కేటాయించాలి.

(ii)             50 మార్కులతో స్కిల్ టెస్ట్ ను జిల్లా స్థాయి నిపుణుల కమిటీ తో నిర్వహించాలి.

(iii)           ఎటువంటి ఇంటర్వూ లు లేవు.

(iv)           ఎంపిక విధానము మొత్తమును మెరిట్ జాబితా సీరియల్ నెం. (i) & సీరియల్ నెం (ii) ల ప్రకారము పైన పేర్కొన్న వాటి ఆధారముగా చేయాలి.

 

  1. j)  స్కిల్ టెస్ట్ నిర్వహించుట కొరకు నిపుణుల కమిటీ:

ఒక నిపుణుల కమిటీని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి వారి ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ లకు 50 మార్కులు గల స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఎంపిక చేయాలి. స్కిల్ టెస్ట్ అభ్యర్ధులుకు  కంప్యూటర్ అప్లికేషన్స్ యొక్క పరిజ్ణానము ఆధారముగా చేసుకొని వాటిపై అవగాహన సామర్ధ్యములపై నిర్వహించాలి. దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ నిర్వహణకు అవసరమయ్యే రహస్య మెటీరీయల్ ను రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయము నుండి నిర్ధేశించిన టైమ్ లోపు పంపబడుతుంది.

 

  1. k) సిబ్బంది యొక్క సేవల కొనసాగింపు విధానము:

మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్ల సేవలను విద్యా సంవత్సరము యొక్క చివరి రోజైన ఏప్రియల్ నెల వరకు కొనసాగుతాయి. ఒక్క రోజు బ్రేక్ తర్వాత ఉద్యోగ సేవలను తిరిగి తదుపరి విద్యా సంవత్సరమునకు కొనసాగించబడతాయి. సంబంధిత విద్యా సంవత్సరములో ఖాళీలు ఏర్పడినచో అందుబాటులో వున్న అభ్యర్ధులకు  మెరిట్ జాబితా ప్రకారం భర్తీ చేయబడతాయి.

 

  1. i)   జాబ్ చార్ట్:-

Ø  మండల స్థాయిలో అన్ని రకముల స్టాటిస్టికల్ డేటా నిర్వహించడంతో పాటు ప్లానింగ్ అండ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (DISE).

Ø  వెబ్ పోర్టల్ డేటా నిర్వహణ

Ø  సర్వ శిక్షా అభియాన్ యొక్క అన్ని రకముల ఇంటర్వేన్షన్స్ కు సంబంధించిన డేటా నిర్వహణ.

Ø  పాఠశాలల నందు వున్న కంప్యూటర్ల యొక్క ప్రస్తుత పని పరిస్థితులను పర్యవేక్షించడం.

Ø  మండల విద్యాశాఖాధికారి వారిచే అప్పగించిన ఏదేని పని.

Ø  డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (DISE) మరియు ఇతర డేటాకు సంబంధించిన విశ్లేషణ.

Ø  అధికారులు కోరిన మీదట వివిధ రకముల నివేదికలు (Reports) జనరేట్ చేయడం.